eshwar: '4 లెటర్స్' విడుదల తేదీ ఖరారు
- హీరోగా ఈశ్వర్ పరిచయం
- సంగీత దర్శకుడిగా భీమ్స్
- ఈ నెల 22న విడుదల
తెలుగు తెరపైకి రావడానికి .. యూత్ ను పలకరించడానికి మరో ప్రేమకథా చిత్రం సిద్ధమవుతోంది. ఈ సినిమా పేరే .. '4 లెటర్స్' .. 'కుర్రాళ్లకు అర్థమవుతుందిలే' అనేది ట్యాగ్ లైన్. హేమలత - ఉదయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి రఘురాజ్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా ద్వారా 'ఈశ్వర్' హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక కథానాయికలుగా చేసిన 'తుయా చక్రవర్తి' . . 'అంకేత మహరాణ'కి కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. టైటిల్ తోను .. ట్యాగ్ లైన్ తోను ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ సినిమాకి, ప్రేక్షకుల నుంచి ఏ స్థాయి ఆదరణ లభిస్తుందో చూడాలి.