కోట్ల ఎఫెక్ట్.. రేపు చంద్రబాబుతో భేటీ కానున్న కేఈ కుటుంబం!
- కోట్ల రాకతో వేడెక్కిన కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయం
- అసంతృప్తితో ఉన్న కేఈ సోదరులు
- చంద్రబాబుకు తమ వాదనను వినిపించనున్న కేఈ బ్రదర్స్
మరోవైపు, కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట్ల చేరికపై కేఈ సోదరులు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కేఈ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుతో కోట్ల భేటీపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఈ విషయం గురించి తనను ఎవరూ సంప్రదించలేదని అన్నారు. తనకు సమాచారం ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబుతో కేఈ కుటుంబం భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.