: ఈ రోబో చాలా ఫాస్ట్
జంతువులలో చిరుత పులి వేగాన్నిమరేదీ అందుకోలేదు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో సునాయాసంగా పరుగెత్తగలదు. అందుకే దీని చూపు పడితే అది ఆహారంగా మారిపోవాల్సిందే. శాస్త్రవేత్తలకు చిరుతపులి వేగమే స్ఫూర్తినిచ్చింది. దీంతో అత్యంత వేగంగా పరుగెత్తగల రోబోను రూపొందించగలిగారు. లండన్ లోని రాయల్ వెటర్నరీ కాలేజీ శాస్త్రవేత్తలు ఐదు సంవత్సరాల పాటు చిరుత పులి వేగాన్ని పరిశీలించి రోబోటిక్ చిరుతను తయారు చేశారు. దీనికి అమెరికా సైన్యం నిధుల సాయాన్ని అందించింది. ఇప్పుడీ రోబో గంటకు 44 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించగల పరుగుల మాంత్రికుడు ఉసెయిన్ బోల్ట్ ను కూడా ఈ రోబో ఓడించగలదనమాట. బోల్ట్ వేగం గంటకు 40 కిలోమీటర్లే!