: సాంకేతిక లోపంతో రైళ్లు ఆలస్యం
కాజీ పేట రైల్వేస్టేషన్ లో సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. రాకపోకలను నియంత్రించే వ్యవస్ధ నిలిచిపోవడంతో మరమ్మత్తులు చేపట్టారు. దీంతో పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ రైలును స్టేషన్ లోనే నిలిపేశారు. కొద్ది గంటల్లో పునరుద్ధరణ పనులు చేపడతామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి పలు రైళ్లు నిర్ణీత సమయానికంటే ఆలస్యంగా నడుస్తున్నాయి.