టీజీ వెంకటేశ్ కామెంట్లపై చంద్రబాబు అసహనం.. ఇలాంటి వ్యాఖ్యలతో నష్టపోతామని వార్నింగ్!
- పార్టీ పాలసీలపై వ్యక్తిగత ప్రకటనలు వద్దు
- కేడర్ అయోమయంలోకి వెళ్లిపోతుంది
- నేతలు సంయమనంతో వ్యవహరించాలి
టీడీపీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు పార్టీ నేతలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. త్వరలోనే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయని సుతిమెత్తగా హెచ్చరించారు. యూపీలో ఉప్పు-నిప్పుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కలిసినప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే తప్పేమిటని టీజీ వెంకటేశ్ అన్నారు.