విశ్వాసానికి పట్టం.. కదిరి అసెంబ్లీ సీటును డాక్టర్ సిద్ధారెడ్డికి ఇచ్చిన జగన్!
- వివరాలు ప్రకటించిన మిథున్ రెడ్డి
- గత ఎన్నికల్లో ఛాన్స్ కోల్పోయిన సిద్ధారెడ్డి
- వైద్యుడిగా కదిరిలో మంచిపేరు
వృత్తి రీత్యా డాక్టర్లు అయిన సిద్ధారెడ్డి, ఆయన భార్య ఉషారాణి కదిరిలోనే స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలోని నిరుపేదలకు నామమాత్రపు ఫీజుకే వైద్యం అందిస్తూ మంచిపేరు గడించారు. 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సిద్ధారెడ్డి అప్పట్లో 18,177 ఓట్లను దక్కించుకున్నారు.
2014లో వైసీపీ తరఫున ఆయనే పోటీ చేస్తారని భావించినప్పటికీ చివరి క్షణంలో పార్టీలోకి వచ్చిన చాంద్ బాషా టికెట్ ను ఎగరేసుకుపోయారు. అయినా సిద్ధారెడ్డి వైసీపీని వీడలేదు. చాంద్ బాషా టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత కదిరి ఇన్ చార్జిగా సిద్ధారెడ్డిని జగన్ నియమించారు. అప్పట్లో సిద్ధారెడ్డికి ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఇప్పుడు కదిరి స్థానాన్ని ఆయనకు కేటాయించినట్టు సమాచారం.