పౌరుషం లేకుండా జగన్ ఇప్పుడు కేసీఆర్ తో కలుస్తున్నారు: టీడీపీ నేత గోరంట్ల
- పవన్ ను విమర్శించడంపై ఆదేశాలేం లేవు
- తలసాని స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి
- జగన్ పౌరుషం లేకుండా కేసీఆర్ ను కలుస్తున్నారు
గతంలో ఓదార్పుయాత్ర కోసం వరంగల్ కు వెళ్లిన జగన్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు తరిమితరిమి కొట్టారని గోరంట్ల గుర్తుచేశారు. అయినా పౌరుషం లేకుండా జగన్ ఇప్పుడు కేసీఆర్ తో కలుస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి ఈసారి కూడా పరాభవం తప్పదని తేల్చిచెప్పారు.