: తెలుగు వెలుగులను చిందిస్తున్న నల్గొండ
దేశభాషలందు తెలుగు లెస్స అయితే తెలుగు భాష అమలులో నల్గొండ మిన్నగా ఉంది. పాలనలో తెలుగు భాష అమలు విషయంలో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా అగ్రగామిగా ఉందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ చెప్పారు. అందుకే అధికార భాషా దినోత్సవమైన నేడు నల్గొండలో సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇదిలావుంచితే, అధికార భాషా దినోత్సవాన్ని మే 14న నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆదేశాలు జారీ చేశారు.