షర్మిళపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. కారకులపై చర్యలకు మాజీ మంత్రి దాడి డిమాండ్!
- షర్మిళను ఓ హీరోకు ముడిపెడుతూ వదంతులు
- హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిళ
- సుమోటాగా విచారణ చేపట్టాలని పోలీసులకు దాడి విజ్ఞప్తి
నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వీరభద్రరావు కోరారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెపై జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోలేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు సత్వరం స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.