కడపకు కృష్ణా జలాలు ఎక్కడొచ్చాయని జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదం: సీఎం రమేశ్
- రెండేళ్లలో పులివెందులకు 15 టీఎంసీల నీళ్లొచ్చాయి
- ఉక్కు కర్మాగారం ఇవ్వని కేంద్రాన్ని జగన్ ఏమనరే?
- కేంద్రాన్ని ప్రశ్నించడానికి ఎందుకు భయం?
కడప జిల్లాకు కృష్ణా జలాలు వస్తే ఆ జలాలు ఎక్కడొచ్చాయని జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదమని అన్నారు. ఈ రెండేళ్లలో పులివెందులకు దాదాపు 15 టీఎంసీల నీళ్లొచ్చాయని, ఈరోజున జిల్లాలో సాగునీరు, తాగునీరు కూడా ఉందని, ఆ ఘనత సీఎం చంద్రబాబుది కాదా? అని ప్రశ్నించారు.