: భారం బౌలర్లపైనే!
ప్లే ఆఫ్ చేరాలంటే ఇక ప్రతి మ్యాచ్ నెగ్గక తప్పని స్థితిలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ జూలు విదిల్చారు. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో టాపార్డర్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో సన్ రైజర్స్ జట్టు 3 వికెట్లకు 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. ధావన్ (59) ఫిఫ్టీతో అలరించగా.. కెప్టెన్ వైట్ (43 నాటౌట్), విహారి (41) రాణించారు. పార్థివ్ 14 బంతుల్లో 26 పరుగులు చేసి మలింగ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ముంబయి జట్టుకు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న దృష్ట్యా స్కోరును, తద్వారా మ్యాచ్ ను కాపాడుకునే భారం ఇక సన్ రైజర్స్ బౌలర్లపైనే ఉంది.