ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 60 మంది కొత్తవారిని బరిలోకి దింపుతాం!: పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
- సమతుల్యత కోసం అన్ని స్థానాల్లో పోటీ
- నాయకులు చిరంజీవిని బలహీనంగా మార్చారు
- ఆ అనుభవంతోనే నేను కమిటీలు వేయలేదు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓపిక లేకపోవడం వల్లే ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి అలా తయారయిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యంలో చేరిన నేతలు పదవీ వ్యామోహంతో చిరంజీవిని బలహీనంగా మార్చారని ఆరోపించారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి ఎదురైన అనుభవాలతోనే ఇప్పుడు జనసేనలో ఎలాంటి కమిటీలు వేయలేదని పేర్కొన్నారు.