: పురుగు పుట్రా తినండర్రా.. బలమొస్తుంది: ఐరాస
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజల ఆహార అలవాట్లు విపరీత పోకడలను సంతరించుకోవడం తెలిసిందే. భౌగోళిక సరిహద్దులు దాటి మరీ పిజ్జాలు, బర్గర్ ల వంటి హై క్యాలరీ వంటకాలు అన్ని దేశాల సాధారణ మెనూలో చోటు సంపాదించుకున్నాయి. ఇలాంటి ఆధునిక కాలంలో ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఏమంటుందో వినండి. ఆకలిని పారద్రోలడానికి, తక్షణ శక్తిని పొందడానికి, అదే సమయంలో కాలుష్యం తగ్గించడానికి ఓ తరుణోపాయం చెబుతోంది.
ఆకలేసినప్పుడు ఫాస్ట్ ఫుడ్ జోలికెళ్ళకుండా, పురుగు పుట్రా తినమని సలహా ఇస్తోంది. గొల్లభామలు, చీమలు, మరికొన్ని ఇతర పురుగు జాతులను ఆరగించాలట. వాటిలో పుష్కలంగా ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు లభ్యమవుతాయని వివరించింది. ప్రపంచంలో రెండు కోట్ల మంది ప్రజలకు ఇవే ఆహారమట. సో.. మనం కూడా లాగించేద్దామా!.