YSRCP: గౌతంరెడ్డిని సంజాయిషీ కోరిన వైసీపీ క్రమశిక్షణ సంఘం

  • ముస్లింలపై అనుచిత వ్యాఖ్యల పర్యవసానం
  • ఇటీవల ఓ చానెల్‌లో మాట్లాడిన వైఎస్‌ఆర్‌ టీయూసీ అధ్యక్షుడు
  • ఆయన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో అధిష్ఠానం సీరియస్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టీయూసీ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డికి పార్టీ క్రమశిక్షణ సంఘం సంజాయిషీ నోటీసులు జారీచేసింది. ఇటీవల ఓ చానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను కించపర్చే విధంగా ఉండడంతో దుమారం చెలరేగింది.

దీంతో గౌతం రెడ్డి వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. అధినేత ఆదేశాల మేరకు ఈ అంశంపై విచారణ నిర్వహించిన క్రమశిక్షణ సంఘం ‘మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో మూడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వండి’ అని పేర్కొంటూ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆయన నుంచి సరైన సంజాయిషీ రాకుంటే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


  • Loading...

More Telugu News