జేసీకి సవాల్ చేసిన సీఐ మాధవ్ రాజీనామా.. త్వరలో వైసీపీలోకి?
- జేసీకి మీసం తిప్పి సవాలు విసిరిన మాధవ్
- వచ్చే ఎన్నికల్లో హిందూపురం లోక్సభ స్థానం నుంచి పోటీ
- వైసీపీ నుంచి హామీ వచ్చాకే రాజీనామా
రెండు దశాబ్దాలుగా పోలీసు శాఖలో ఉన్న మాధవ్ పోలీసు అధికారుల సంఘం నాయకుడిగా ఉన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి స్పష్టమైన హామీ లభించిన తర్వాతే ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.