చైన్ స్నాచింగ్ నిందితుల కోసం గాలింపు.. ముళ్లపొదలో దొరికిన బైక్!
- చైన్ స్నాచర్ల కోసం జల్లెడ పడుతున్న పోలీసులు
- బైక్ను అమ్మేసినట్టు తెలిపిన యజమాని
- నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశం
చైన్ స్నాచింగ్ అనంతరం తాము వాడిన బైక్ను నిందితులు ముళ్లపొదల్లో వదిలి వెళ్లినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. చైన్ స్నాచింగ్ ఘటనపై హోమంత్రి మొహముద్ అలీ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి ముఠాలు వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని రాచకొండ సీపీని ఆదేశించినట్టు తెలిపారు.