ఎన్నికల సంఘంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు!
- వీవీ పాట్ స్లిప్పులను లెక్కించాలంటూ కోర్టులకు వెళ్తున్నాం
- వీవీ పాట్ స్లిప్పులను రిటర్నింగ్ అధికారులు తొలగిస్తున్నారు
- ఈ వ్యవస్థను ఏమనాలో అర్థం కావడం లేదు
ఈవీఎం లకు, వీవీ పాట్ లకు పోలింగ్ విషయంలో 1 శాతం తేడా ఉన్న కోదాడ, ధర్మపురి, ఇబ్రహీంపట్నంలలో వీవీ పాట్ స్లిప్పులు ఎందుకు లెక్కించలేదని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. మంచిర్యాలలో సాయంత్రం 4 గంటల తర్వాత వేల సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యాయని... పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని మండిపడ్డారు.