ప్రజా సంక్షేమం కోసం మరో యాగానికి కేసీఆర్ రెడీ.. వైజాగ్లో స్వరూపానందేంద్ర స్వామితో ఏకాంత చర్చ
- యాగాలపై కేసీఆర్కు అచంచల విశ్వాసం
- ఇప్పటికే పలు యాగాల నిర్వహణ
- తాజాగా మరొకటి నిర్వహించాలని నిర్ణయం
తాజాగా, మరోమారు యాగం చేయాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం యాగం నిర్వహించాలని నిర్ణయించిన కేసీఆర్ ఈ విషయమై స్వామీజీతో చర్చించినట్టు సమాచారం. అయితే, కేసీఆర్ నిర్వహించబోయేది సహస్ర ఆయుత చండీ యాగమా? లేక ఇంకేదైనానా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.