ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఒవైసీ
- మైనార్టీ హక్కుల గురించి భారత్ నుంచి మీరే నేర్చుకోవాలి
- ముస్లిం వ్యక్తి మాత్రమే పాక్ అధ్యక్షుడు కాగలరు
- మా దేశంలో అణగారిన వర్గాల వారు ఎందరో రాష్ట్రపతులు అయ్యారు
పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం కేవలం ముస్లిం వ్యక్తి మాత్రమే అధ్యక్షుడు కాగలడని... భారత్ లో అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఎందరో రాష్ట్రపతి పదవిని చేపట్టారని చెప్పారు. మైనార్టీల హక్కులు, సమ్మిళిత రాజకీయాల గురించి మా దేశం నుంచి ఖాన్ సాబ్ నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఒవైసీ స్పందించారు.