: సచిన్ బొమ్మ, సంతకంతో బంగారు నాణేలు


అక్షయ తృతీయ సందర్భంగా సచిన్ బొమ్మ, సంతకంతో కూడిన పది గ్రాముల బంగారు నాణేలను వాల్యూమార్ట్ గోల్డ్ అండ్ జ్యువెల్స్ సంస్ధ విడుదల చేసింది. 24 కేరట్ల బంగారంతో ఉన్న లక్ష నాణేలను మార్కెట్లోకి విడుదల చేసారు. ఒక్కోనాణెం వెల 34 వేలుగా నిర్ణయించారు. ఈ నాణేలను ప్రముఖ ఆభరణాల దుకాణాలతో బాటు వాల్యూమార్ట్ గోల్డ్. కామ్ వెబ్ సైట్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ కంపెనీ సచిన్ తో 3 ఏళ్ళ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం సచిన్ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, "క్రికెట్ పిచ్ పై బోల్డన్ని బంగారు అనుభూతులు నాకు తెలుసు కానీ, ఈ అనుభూతి వైవిధ్యంగా ఉంది. బంగారం అంటే నాకూ ఇష్టమే" అన్నారు.

  • Loading...

More Telugu News