నేడు కరీంనగర్ వెళ్లనున్న రాష్ట్రపతి కోవింద్
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి
- నేడు ప్రతిమ కళాశాల కార్యక్రమానికి హాజరు
- నరసింహన్, సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా
ఈ సందర్భంగా అక్కడి ప్రతిమ మెడికల్ అండ్ సైన్స్ కళాశాలలో కొత్తగా నిర్మించిన ఆడిటోరియంను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావులు కూడా హాజరుకానున్నారు.