నేను సినిమాల్లోకి రావడానికి మా అమ్మ ఒప్పుకోలేదు!: సీనియర్ హీరోయిన్ లత
- ఎంజీఆర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది
- మా పెద్దమ్మ ప్రోత్సహించింది
- మా అమ్మను ఆయన ఒప్పించారు
ఎంజీఆర్ సినిమాలోకి కొత్త హీరోయిన్ కావాలని వెతుకుతున్నారనీ .. నన్ను సినిమాల్లోకి తీసుకురమ్మని అడిగారట. 'మా అమ్మాయి చదివేది తొమ్మిదో క్లాస్ .. సినిమాల్లో చేయదు' అనేసి మా అమ్మ ఫోన్ పెట్టేసిందట. మా పెద్దమ్మ మాత్రం ఆ సినిమా చేయమని నన్ను ప్రోత్సహిస్తూ వచ్చింది. రెండు రోజుల తరువాత మనోహర్ గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎంజీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన మా అమ్మను ఒప్పించి .. నన్ను ఆ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. అలా ఆ సినిమాతో కథానాయికగా నా కెరియర్ మొదలైంది" అని అన్నారు.