టాప్ లేచింది... త్వరత్వరగా మూడు వికెట్లు!
- లంచ్ వరకూ వికెట్ నష్టపోని ఆసీస్
- ఆపై బుమ్రా బాల్ తో పెవీలియన్ కు ఫించ్
- ఉమేష్ యాదవ్ కు దొరికిన ఖవాజా
112 పరుగుల వద్ద ఫించ్ (50)ను బుమ్రా అవుట్ చేయగా, ఆపై వచ్చిన ఖవాజా (5)ను ఉమేష్ యాదవ్ పెవీలియన్ కు పంపించాడు. ఆపై కాసేపటికే, 70 పరుగులతో క్రీజులో బలంగా నిలబడిన మరో ఓపెనర్ హరీస్ (70)ను హనుమ విహారి అవుట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు కాగా, షాన్ మార్ష్ 8 పరుగులతో, హ్యాండ్స్ కాంబ్ 4 పరుగులతో ఆడుతున్నారు.