: విశాఖలో ఎంపీ లగడపాటి బస్సుయాత్ర
రాష్ట్రంలో సమైక్య వాదానికి మద్దతుగా విశాఖపట్నంలో కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బస్సుయాత్ర చేపట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్ర ఆవశ్యకతను తెలిపేందుకే ఈ బస్సుయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఉద్యమాల వల్ల ఎంతో నష్టపోయామనే భావన తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉందని.. ఆ ప్రాంతంలోని ఎక్కువమంది ప్రజలు సమైక్యవాదానికే మద్దతిస్తున్నారని లగడపాటి అన్నారు. సమైక్యవాదమే తెలుగువారి గుండె చప్పుడని ఆయన అన్నారు.