: జగన్, ఓఎంసీ, ఎమ్మార్ నిందితుల రిమాండ్ పెంపు


జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో నిందితులకు న్యాయస్థానం జూన్ 3 వరకూ రిమాండ్ పొడిగించింది. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన సీబీఐ కోర్టు నిందితులకు పలు సూచనలు చేసింది. అన్ని చార్జిషీట్లు ఒకేసారి విచారణ చెయ్యాలన్న జగన్ పిటీషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. నేరాలు వేర్వేరు కనుక విచారణ కూడా వేర్వేరుగానే చేయాలని స్పష్టం చేసింది. మరో వైపు జగన్ అక్రమాస్తుల కేసులో కేవీ బ్రహ్మానందరెడ్డికి బెయిల్ ఇవ్వవద్దంటూ సీబీఐ కౌంటర్ పిటీషన్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News