విడాకులకు ఒప్పుకోని భార్య.. నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడు!
- గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘటన
- ఫోన్ ద్వారా విడాకులు ఇచ్చిన ప్రబుద్ధుడు
- కేసు నమోదు చేసిన సైబర్ సెల్ పోలీసులు
గుజరాత్ కు చెందిన ఓ యువతికి అస్ట్రేలియాలో ఉంటున్న భారతీయ యువకుడితో 2015లో వివాహం అయింది. పెళ్లి అయిన కొత్తల్లో అంతా బాగానే ఉన్నప్పటికీ కొంతకాలం తర్వాత వీరిమధ్య గొడవలు వచ్చాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన భర్త.. ఫోన్ లోనే బాధితురాలికి విడాకులు ఇస్తున్నట్లు తెలిపాడు. దీంతో దిగ్భ్రాంతికి లోనైన యువతి న్యాయపోరాటానికి దిగింది.
అయితే భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన సదరు యువకుడు గతంలో తామిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీటికి అభ్యంతకరమైన, అశ్లీల కామెంట్లను జోడించాడు. వీటిని గమనించిన యువతి వెంటనే అహ్మదాబాద్ సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.