Rashmi: రష్మికి అడ్వాన్స్ పంపా.. ఇవిగో ఆధారాలు: 10కె రన్ నిర్వాహకుడు

  • రష్మి మేనేజర్‌కు డబ్బులు పంపా
  • స్క్రీన్ షాట్లే ఆధారాలు
  • చట్టపరంగా చర్య తీసుకుంటా

ప్రముఖ యాంకర్ రష్మి తాము నిర్వహిస్తున్న 10 కె రన్‌లో పాల్గొంటోందంటూ తిరుపతికి చెందిన ఆ కార్యక్రమ నిర్వాహకులు హోర్డింగ్ పెట్టడమే కాకుండా దానిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిని చూసిన రష్మి ట్విట్టర్ ద్వారా స్పందించారు. తననెవరూ సంప్రదించలేదని ఈ ఈవెంట్‌లో తాను భాగస్వామి కాదని.. ఈవెంట్ నిర్వాహకులెవరో తెలిస్తే విషయాన్ని వాళ్లకు తెలియజేయాలని నెటిజన్లను కోరారు.

దీనిపై స్పందించిన కార్యక్రమ నిర్వాహకుడు.. కార్యక్రమానికి రష్మి రావడానికి ఒప్పుకుందని.. ఇప్పుడు ఖండిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమం కోసం ఆమెకి అడ్వాన్స్ కూడా ఇచ్చామన్నారు. తాను ఆమె మేనేజర్‌కు డబ్బులు పంపానని.. ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొంటూ... స్క్రీన్ షాట్లు పంపారు. దీనిపై తాను చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. దీనిపై ప్రతిస్పందించిన రష్మి.. మాట్లాడేముందు నిజానిజాలు తెలుసుకోవాలని.. ఆయన చేసే వ్యాఖ్యలు అబద్ధాలని రుజువవుతాయని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News