: సిద్ధరామయ్య 'ప్రమాణస్వీకారం'లో అపశృతి


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమాణస్వీకార కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. నేడు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారం సందర్భంగా తొక్కిసలాట జరిగింది. మంజప్ప అనే కాంగ్రెస్ కార్యకర్త రెండో నెంబరు ద్వారం గుండా స్టేడియంలో ప్రవేశిస్తుండగా ఒక్కసారిగా తోపులాట సంభవించింది. దీంతో, కిందపడిపోయిన మంజప్ప తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళగా, అప్పటికే అతను ప్రాణాలు విడిచాడు.

  • Loading...

More Telugu News