: ఎన్నికల్లో భారీ రిగ్గింగ్ జరిగింది: ఇమ్రాన్ ఖాన్


పాకిస్తాన్ ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ చోటుచేసుకుందని మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ గత వారం ఓ ప్రచార సభలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నేడు ఆసుపత్రి నుంచే తన ఆరోపణలు సంధించారు. రిగ్గింగ్ లో పోలింగ్ సిబ్బందితోపాటు పోలీసుల ప్రమేయంపై అందిన ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేపట్టాలని ఇమ్రాన్ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఇక పాకిస్తాన్ లో మరలా ప్రజాస్వామ్య పవనాలు వీచడంపై ఈ మాజీ కెప్టెన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది 'నయా పాకిస్తాన్' (నూతన పాకిస్తాన్) అని అభివర్ణించారు.

తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, 'బలమైన విపక్షాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప బలంగా భావించాలి. గత పదేళ్ళుగా పాకిస్తాన్ లో సమర్థ ప్రతిపక్షం లోపించింది. ఇక మేం, మంచి విపక్షంతో ఒనగూరే లాభాలేమిటో చాటుతాం' అని వివరించాడు. పాక్ పార్లమెంటు దిగువసభకు శనివారం జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ 34 స్థానాలు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News