తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేను వేదికపైకి రాకుండా అడ్డుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్!
- వేదికపైకి రాబోయిన తాటికొండ వెంకటేశ్వర్లు
- చేతితో అడ్డుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- వెనక్కి వెళ్లిపోయి ప్రజల్లో కలియతిరిగిన నేత
సత్తుపల్లిలో ప్రజాఆశీర్వాద సభ సందర్భంగా వేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్ ఒక్కసారిగా ఆగిపోయారు. అనంతరం అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లును సభావేదిక పైకి ఎక్కకుండా ముఖ్యమంత్రి అడ్డుకున్నారు. మిగతా నేతలంతా పైకి వెళ్లాలని సూచించారు. సాక్షాత్తూ సీఎం అడ్డుకోవడంతో వెంకటేశ్వర్లు రెండు చేతులతో దండం పెడుతూ వెనక్కి మళ్లారు. అనంతరం సభా ప్రాంగణంలో తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, కేసీఆర్ ఇలా ఎందుకు వ్యవహరించాన్న విషయమై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.