హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం... ఇద్దరి మృతి!
- మూసాపేట ఫ్లయ్ ఓవర్ పై ప్రమాదం
- డివైడర్ ను దాటి పాదచారులపైకి వెళ్లిన బస్సు
- ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన స్థానికులు
ఘటన జరిగిన వెంటనే స్థానికులు బస్సు డ్రైవర్ పై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మూసాపేట ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. భరత్ నగర్ నుంచి ఎస్సార్ నగర్ వరకూ ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.