కర్ణాటక సీఎం రాజీనామా అంటూ వార్తల ప్రసారం.. ఛానల్‌పై కేసు నమోదు
- అనారోగ్యం కారణంగా రాజీనామా అని వార్తలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన జేడీఎస్
- ఛానల్ ఎడిటర్, రిపోర్టర్‌పై కేసు నమోదు
ఆయన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ.. రాజీనామా చేయబోతున్నారని పేర్కొంటూ.. రాష్ట్రంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంగా కుమారస్వామి రోజుకు దాదాపు 16 గంటలు కష్టపడుతున్నారని పార్టీ పేర్కొంది. ప్రకాశ్ ఫిర్యాదు మేరకు సదరు ఛానల్ ఎడిటర్, రిపోర్టర్‌పై పోలీసులు సెక్షన్ 120బీ, 153, 505 కింద కేసు నమోదు చేశారు.