Nivedha Thomas: డ్యాన్స్ ఇరగదీసిన నివేదా థామస్... వీడియో!

  • సోదరులతో కలసి పెళ్లిలో డ్యాన్స్
  • అద్భుతంగా చేసిందంటున్న నెటిజన్లు
  • వైరల్ అవుతున్న వీడియో

'జై లవకుశ', 'నిన్ను కోరి' వంటి చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ భామ నివేదా థామస్, చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. తన సోదరులతో కలసి ఓ వివాహ వేడుకలో నివేదా ఈ డ్యాన్స్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రభుదేవా హీరోగా వచ్చిన 'గులేబకావళి' తమిళ చిత్రంలోని పాటకు నివేదా డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకున్న ఆమె, "మీరు పార్టీని ఎలా ఎంజాయ్‌ చేస్తారు? మీ హీల్స్‌ ను విసిరేయండి. వెళ్లి డ్యాన్స్‌ చేయండి" అని వ్యాఖ్యానించింది.

ఇక నివేదా డ్యాన్స్ అద్భుతమని కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె నిఖిల్ హీరోగా నటిస్తున్న 'శ్వాస' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న  సంగతి
తెలిసిందే. నివేదా థామస్ డ్యాన్స్ ను మీరూ చూసేయండి!

  • Loading...

More Telugu News