బ్రేకింగ్... గుండెపోటుతో కర్నూలు బాలసాయి బాబా కన్నుమూత!
- కొంతకాలంగా హైదరాబాద్ లో చికిత్స
- ఈ ఉదయం గుండెపోటు
- కర్నూలు ప్రాంతంలో ఆశ్రమం, సేవలు చేస్తున్న బాలసాయి
శివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాలు తీస్తూ పేరు తెచ్చుకున్న బాలసాయిబాబాపై అనేక అరోపణలు ఉన్నాయి. గుప్త నిధుల తవ్వకాలు, భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ, తనదైన ప్రవచనాలతో భక్తులను ఆయన విశేషంగా ఆకట్టుకునేవారు. బాలసాయి మృతి వార్త విని ఆయన అనుచరులు కంటతడి పెట్టారు. ఆయన పేరిట కర్నూలు ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆయన మరణంపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.