: నేడు హైదరాబాద్ కీలక పోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఈ రోజు కీలక మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టును, నాలుగో స్థానం కోసం పోటీపడుతున్న హైదరాబాద్ జట్టు ఢీ కొట్టనుంది. హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే ముంబైతోపాటు మిగిలిన రెండు లీగుల్లోనూ గెలుపొందాల్సి ఉంది. కాగా ఈనాటి మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ముంబైలో జరుగుతుంది.