విమానం ఢీకొని వ్యక్తి మృతి.. టేకాఫ్ అవుతుండగా ఘటన!
- మృతి చెందిన వ్యక్తిని స్పెయిన్ వాసిగా గుర్తింపు
- మరో విమానం ఎక్కించే సమయంలో ఘటన
- దర్యాప్తు జరుపుతున్న అధికారులు
స్పెయిన్ నుంచి వచ్చిన ఆల్బర్ట్ విమానంలో సిబ్బందితో గొడవకు దిగాడు. దీంతో విమానం మాస్కోలో ల్యాండైన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఆర్మేనియా రాజధాని యెరెవాన్ వెళ్లే విమానాన్ని ఎక్కించేందుకు తీసుకెళ్తుండగా అతడు ఒక్కసారిగా రన్వే పైకి రావడంతో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆల్బర్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.