PAYTM: ఇకపై పేటీఎం ద్వారా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు!
- ఎల్ఐసీ, పేటీఎం ల మధ్య కుదిరిన ఒప్పందం
- పేటీఎం ద్వారా ఇప్పటికే 30 కంపెనీలు ప్రీమియంలు చెల్లిస్తున్నాయి
- ప్రకటించిన పేటీఎం సీవోవో కిరణ్
పేమెంట్ సేవల సంస్థ పేటీఎం తాజాగా ఎల్ఐసీ ప్రీమియంని చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని పేటీఎం సీవోవో కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. ఇప్పటికే పేటీఎం ద్వారా దాదాపు 30 కంపెనీలు ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లిస్తున్నాయని, తాజాగా ఎల్ఐసీ సంస్థకు కూడా ప్రీమియంలను చెల్లించవచ్చని పేటీఎం సీవోవో అన్నారు.