పంజాబ్ లో ప్రార్థనాలయంపై బాంబులు, తుపాకులతో విరుచుకుపడ్డ దుండగులు!
- ముగ్గురి దుర్మరణం, 8 మందికి తీవ్రగాయాలు
- హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
- నిందితుల కోసం పోలీసుల గాలింపు
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఇద్దరు దుండగులు నిరంకారీ భవన్ వద్దకు బైక్ పై చేరుకున్నారని తెలిపారు. అనంతరం ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్న వాళ్లపై బాంబులు విసిరారనీ, నాటు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారని పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు గాలింపును ముమ్మరం చేశామని చెప్పారు.