TRS: రాజీనామా వార్తలను ఖండించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- ఆ వార్తలు అబద్ధం
- కొన్ని రోజులుగా అసత్య ప్రచారం చేస్తున్నారు
- రేవంత్ దుష్ప్రచారం చేయడం తగదు
టీఆర్ఎస్ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్ లు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అబద్ధమని అన్నారు. మంత్రి కేటీఆర్ తో భేటీ అనంతరం విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజీనామా వార్తల్లో వాస్తవం లేదని, ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరారు. తాను పార్టీ మారుతున్నానని కొన్ని రోజులుగా అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి కావాలనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.