75 నుంచి 80 స్థానాల్లో మా గెలుపు ఖాయం: భట్టి విక్రమార్క ధీమా
- రేపటి నుంచి ప్రచారం వేగవంతం చేస్తాం
- పది బహిరంగ సభల్లో రాహుల్, సోనియా పాల్గొంటారు
- టికెట్లు దక్కని వారికి భవిష్యత్ లో సముచిత స్థానం
ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న బహిరంగ సభలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్, సోనియాగాంధీలు పాల్గొంటారని, మొత్తం పది సభలలో వారు ప్రసంగించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు టికెట్ల విషయమై ఆయన మాట్లాడుతూ, సాధ్యమైనంత వరకు సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పారు. టికెట్లు దక్కని అభ్యర్థులను భవిష్యత్ లో సముచిత స్థానంతో గౌరవిస్తామని చెప్పారు. కూటమి ఏర్పాటు కాదనుకున్న టీఆర్ఎస్ కు అది ఏర్పడంతో దిమ్మతిరిగిపోయిందని విమర్శించారు.