: జీహెచ్ఎంసీ కార్మికుల ఆందోళన
హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలో చెత్త తరలింపు కాంట్రాక్టును రాంకీ సంస్థకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి కార్మికులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కార్యాలయానికి తాళాలు వేసి గేటు ముందు చెత్త లారీలను అడ్డుగా నిలిపారు.
రాంకీ సంస్థకు, మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాంకీ సంస్థకు కాంట్రాక్టును ఇవ్వడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాంకీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు.