మాతో చేతులు కలుపుతారో, లేదో అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయించుకోవాలి: చంద్రబాబు
- మహాకూటమిలో చేరని పార్టీలన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నట్టే
- తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు మోదీ గుప్పిట్లో ఉన్నాయి
- రాజకీయ ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు
డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి తాను చేసిన సూచనలను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నల్లధనాన్ని కట్టడి చేయడానికి మాత్రమే తాము సహకరిస్తామని చెప్పామని... ప్రజలను ఇబ్బంది పెట్టడానికి సహకరిస్తామని చెప్పలేదని అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి... రూ. 2వేల నోట్లను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే నోట్లను రద్దు చేశారని మండిపడ్డారు.