: ఘనంగా సీపీఐ నారాయణ కుమార్తె కల్యాణం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కుమార్తె స్పందన వివాహం నేడు ఘనంగా జరిగింది. ఈ పరిణయ మహోత్సవానికి శామీర్ పేటలోని లియోనియో రిసార్ట్స్ వేదికగా నిలిచింది. ఈ వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కేవీపీ రామచందర్ రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణ తదితరులు ఈ వివాహానికి విచ్చేసి నూతన వధూవరులు స్పందన, దేవనాగ్ లను ఆశీర్వదించారు.