: నూతన అధ్యాయానికి తెరదీసిన డీజీపీ దినేశ్ రెడ్డి!


రాష్ట్రంలో ఇప్పటి వరకు పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయంటే చాలు, రాజకీయ నాయకుల నుంచి పోలీసు విభాగానికి వచ్చే సిఫారసులకు, ఒత్తిళ్ళకు అంతుండేదికాదు. తన నియోజకవర్గానికి అనుకూలుడైన డీఎస్పీని నియమించమనో, బాగా కావల్సిన ఎస్పీని స్వంత జిల్లాకు తెచ్చుకోవాలనో రాజకీయనేతలు పోలీస్ బాస్ లకు సూచించడం మామూలే. కానీ, ప్రస్తుత డీజీపీ దినేశ్ రెడ్డి సరికొత్త సంప్రదాయానికి తెరదీశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన 50 మంది డీఎస్సీల బదిలీలలో ఎక్కడా రాజకీయ ముద్ర లేకుండా జాగ్రత్తపడ్డారు.

రాజకీయనేతల ప్రభావాలకు లోనుకాకుండా బదిలీల ప్రక్రియ ముగించారు. ఈసారి, సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు, పీసీసీ చీఫ్ బొత్స, ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టూరిజం మంత్రి వట్టి వసంత్ కుమార్, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు చేసిన సిఫారసులు అన్నీ బుట్టదాఖలైనట్టు సమాచారం. మంత్రులు ఇటీవలి కాలంలో అవినీతి బురదలో కూరుకుపోతున్న నేపథ్యంలో అధికారులు ఇక ఎంతమాత్రం వారికి గులాం అనబోరని తాజా పరిణామాలు చాటడం లేదూ?

  • Loading...

More Telugu News