వదంతులకు చెక్ పెట్టిన వట్టి వసంతకుమార్.. జనసేన, వైసీపీలో చేరికపై స్పష్టత!
- ఆ రెండు పార్టీల్లోనూ చేరడం లేదు
- మళ్లీ కాంగ్రెస్‌లోనే చేరుతా
- చంద్రబాబుకు నైతిక విలువలు లేవు
శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన నైతిక విలువలు లేని చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ కారణంగానే తాను కాంగ్రెస్‌ను వీడినట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం తనకు లేదన్నారు. అయితే, కొన్నాళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోనే చేరుతానని చెప్పడం విశేషం. దీంతో ఆయన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అయిన వట్టి వసంతకుమార్ ఆ పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.