: వేలానికి జాతిపిత వస్తువులు


జాతిపిత మహాత్మా గాంధీ ఉపయోగించిన వస్తువులను వేలం వేయనున్నారు. ఆయన ఉపయోగించిన చెప్పులు, జపమాల, స్వయంగా నేసిన శాలువా, దుప్పటి, కొన్ని ఫొటోలు ఈ వేలంలో అమ్మకానికి పెట్టనున్నారు. వీటన్నింటికి రూ. 2 కోట్లకు పైగా ధర పలకొచ్చని వేలం నిర్వాహకులు భావిస్తున్నారు. బ్రిటన్ లోని మలక్ వేలం కేంద్రంలో వీటిని ఈ నెల 21న వేలం వేయనున్నారు. ఈ వస్తువులు గాంధీ 1924లో ఓ స్నేహితుడికిచ్చినవని తెలుస్తోంది. వీటిలో గాంధీ సుప్రసిద్ధ 'చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు' సిద్ధాంతానికి ప్రతీకలైన మూడు కోతుల బొమ్మలు కూడా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News