Vasireddypadma: పరమానందయ్య శిష్యుడి స్థాయికి కూడా చంద్రబాబు సరిపోడు: వాసిరెడ్డి పద్మ

  • చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు
  • హత్యాయత్నం వెనుక సీఎం, డీజీపీలు ఉన్నారు
  • వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండకూడదని కుట్ర

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని చంద్రబాబు చులకన చేసి మాట్లాడటాన్ని దుర్మార్గపు చర్యగా ఆమె అభివర్ణించారు. చంద్రబాబు పరమానందయ్య శిష్యుడి స్థాయికి కూడా సరిపోడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్‌ గరుడ’ పక్కా ప్లాన్‌ ప్రకారమే జరుగుతోందని, హత్యాయత్నం వెనుక సీఎం, డీజీపీలు ఉన్నారు కాబట్టే విచారణ ముందుకు సాగడం లేదని ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాల నుంచి హత్యా రాజకీయాలకు చంద్రబాబు దిగజారారని ఆమె దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీతో కలిసిన చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండకూడదనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు చేసే రాజకీయాలు ప్రజలకు తెలియకుండా చేస్తున్నారన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం తర్వాత జరిగిన పరిణామాలను ప్రజలు చూస్తూనే ఉన్నారని ఆమె అన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News