గొడుగును మూయలేక వదిలెళ్లిపోయిన ట్రంప్... నవ్వుకుంటున్న నెటిజన్లు... వీడియో!
- ఇల్లినాయిస్లో జరుగుతున్న కార్యక్రమానికి బయలుదేరిన ట్రంప్
- వర్షం వస్తుండటంతో గొడుగు పట్టుకుని విమానంలోకి
- డోర్ వద్ద దాన్ని వదిలేసిన ట్రంప్
ఆపై గాలికి ఆ గొడుగు అటూ ఇటూ తిరుగుతూ, విమాన ద్వారం వద్దే ఇరుక్కుపోయింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, సరదా కామెంట్లు వస్తున్నాయి. "ట్రంప్ కు గొడుగును ఎలా మూసివేయాలో కూడా తెలీదు" అని ఒకరు, "చేతిలో ఉన్న గొడుగునే మూయలేదంటే బాత్ రూమ్ కు వెళితే ఫ్లష్ కూడా చేయరేమో" అని ఇంకొకరు, "ట్రంప్ తెల్లగా ఉంటారు. గొడుగు నల్లగా ఉంది కాబట్టే, ఆయన అందుకే పట్టించుకోకుండా వదిలేసుంటారు" అని ఇంకొకరు కామెంట్లు చేశారు. గతంలోనూ ట్రంప్ కు సంబంధించిన ఇటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి.