Chandrababu: జగన్ చాలా కష్టపడుతున్నారు.. ఏదో ఒకరోజు సీఎం అవుతారు: సినీ నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • నేను ఏ పార్టీకీ చెందిన వాడిని కాదు
  • ప్రత్యేక హోదా సాధనే నా లక్ష్యం
  • గతంలో చంద్రబాబును కూడా విమర్శించా

‘ఆపరేషన్ గరుడ’ పేరుతో చాలా ఫేమస్ అయిన నటుడు శివాజీ ఓ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకూ ఆయన టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని.. టీడీపీ చెప్పినట్టు నడుచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజల కోసం జగన్ చాలా కష్టపడుతున్నారని.. ఏదో ఒక రోజు ఆయన సీఎం అవుతారని శివాజీ పేర్కొన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధనే తన లక్ష్యమన్న శివాజీ, తాను ఏ పార్టీకి చెందినవాడిని కానన్నారు. గతంలో తాను సీఎం చంద్రబాబును కూడా విమర్శించానన్నారు. ఆ సమయంలో వైసీపీ నేతలు తనను సంప్రదించారని, తమతో కలసి రావాలని అడిగారని  వెల్లడించారు. వైసీపీలో ఎప్పుడూ దూషణలకు పాల్పడేవారిని పక్కనబెట్టి.. బుగ్గన రాజేందర్ రెడ్డి వంటి వారితో మాట్లాడిస్తే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ఆ సందర్భంగా వారికి సూచించానని శివాజీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News