: 'అమ్మ' అపురూపం


ఓ పెద్ద త్రాసులో ఒకవైపు ధరిత్రిని ఉంచినపుడు అవతలివైపు అమ్మను కూర్చోబెడితే చాలు... సమతూకం వచ్చేస్తుంది. మాతృమూర్తి అంత శక్తిమంతురాలు. అవని ప్రాణుల మయం అనుకుంటే, ఆ ప్రాణికోటికి ఊపిరిపోసింది అమ్మే కదా. తల్లి లేకుండా ఏ ప్రాణీ పురుడు పోసుకోదు. ముఖ్యంగా మనిషి.. అమ్మతో చివరి వరకు అనుబంధం కొనసాగించగలిగే ఏకైకజీవి. గర్భంలో ఉండి ఆమె రక్తాన్ని పంచుకుంటాడు, భూమ్మీదకొచ్చీరాగానే స్తన్యాన్నందుకుంటాడు. ఆమె చేయందుకుని నడకలు నేర్చుకుంటాడు. గోరు ముద్దలు తింటూ, గారాంచేస్తాడు. దెబ్బ తగిలితే అమ్మా అంటాడు, కొన్నిపరిస్థితుల్లో అమ్మనూ దెబ్బతీస్తాడు.

కానీ, తన బిడ్డకు చిన్నగాయమైనా ఆ అమ్మ మనసు విలవిల్లాడుతుంది. ఎదిగిన బిడ్డలు గుండెలపై కొట్టే దెబ్బలకు మమకారం అనే మందుపూసి మౌనంగా ముందుకు సాగుతుంది. అందుకే ఆమె 'అమ్మ' అయింది. 'మాతృ దేవో భవ' అని మనం అనుకున్నా, 'మదర్ ఈజ్ గాడ్' అని పాశ్చాత్యులు భావించినా.. అన్నింటి సారాంశం ఒక్కటే. అమ్మ అమూల్యం, ఆమె ప్రేమ అనిర్వచనీయం. నేడు ఆ అపురూపమైన అమ్మ విశిష్టతను మరొక్కసారి మననం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మాతృ దినోత్సవం కాబట్టి!

  • Loading...

More Telugu News